నగల దుకాణంలో భారీ చోరీ.. గోడకు కన్నం పెట్టి..

ABN , First Publish Date - 2020-09-26T16:51:23+05:30 IST

రియలూరులో నగల దుకాణంలో ప్రవేశించిన ఆగంత కులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. తిరుప్పూర్‌కు చెందిన సౌందర్‌రాజన్‌ అరియలూరు చిన్నకడై వీధిలో నగల దుకాణం

నగల దుకాణంలో భారీ చోరీ.. గోడకు కన్నం పెట్టి..

చెన్నై : అరియలూరులో నగల దుకాణంలో ప్రవేశించిన ఆగంత కులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. తిరుప్పూర్‌కు చెందిన సౌందర్‌రాజన్‌ అరియలూరు చిన్నకడై వీధిలో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి యధావిధిగా దుకాణం మూసేసి వెళ్లిన సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఉదయం దుకాణం తెరవగా వస్తులన్నీ చిందరవందరగా పడివుండడం చూసి దిగ్ర్భాంతి చెందాడు. దుకాణం వెనుక భాగంలో గ్రిల్స్‌ తొలగించి ఉండడాన్ని గమనించాడు. దుకాణం వెనుక వైపున్న టెంకాయల దుకాణం నుంచి గోడకు కన్నం వేసి లోనికి ప్రవేశించిన వ్యక్తులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. అక్కడే ఉన్న బీరువాను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బీరువాలో ఉన్న రూ.1.50 లక్షల నగదు, బంగారు, వెండి నగలు చోరీ కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారించారు. ఆగంతకుల ఆచూకీ కోసం వచ్చిన పోలీసు జాగిలం దుకాణం నుంచి కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. అదే సమయంలో సమీపంలోని దుకాణాల వద్ద ఏర్పాటుచేసిన సీసీఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-26T16:51:23+05:30 IST