ముప్పై ఎనిమిదేళ్ళ క్రితం దొంగతనం చేసి...

ABN , First Publish Date - 2020-07-12T23:02:57+05:30 IST

ఎప్పుడో 38 ఏళ్ళ క్రితం దొంగతనం చేసి ఇప్పుడు దొరికిపోయాడా దొంగ. వివరాలిలా ఉన్నాయి. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కేంద్రంలోని అమిర్‌ఘర్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొందరు దొంగలు 1982 డిసెంబర్ 30 వ తేదీన దోపిడీ చేశారు. ఆ సమయంలో బ్యాంకు మేనేజర్ ఆ దొంగలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేసి అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ శివదత్ శర్మను చంపేశారు కూడా.

ముప్పై ఎనిమిదేళ్ళ క్రితం దొంగతనం చేసి...

బనస్కాంత : ఎప్పుడో 38 ఏళ్ళ క్రితం దొంగతనం చేసి ఇప్పుడు దొరికిపోయాడా దొంగ. వివరాలిలా ఉన్నాయి. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కేంద్రంలోని అమిర్‌ఘర్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొందరు దొంగలు 1982 డిసెంబర్ 30 వ తేదీన దోపిడీ చేశారు. ఆ సమయంలో బ్యాంకు మేనేజర్ ఆ దొంగలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేసి అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ శివదత్ శర్మను చంపేశారు కూడా.


ఆ తర్వాత... రూ. 1.32 లక్షలు దోచుకుని పారిపోయారు. అయితే ఈ దొంగతనం చేసిన ముఠాలో ఇద్దరు దొంగలు కొద్ది రోజులకే దొరికిపోగా... ఆ గ్యాంగులోని మరో నలుగురు మరణించారు కూడా. ముఠాలోని దీప్‌సింగ్ రాజ్‌పుత్ ఒక్కడే జీవించి ఉన్నాడు.దీప్‌సింగ్ పై... హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి తొమ్మిది కేసులు గు గుజరాత్, రాజస్తాన్‌లలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. అయితే ఇన్నేళ్లూ గుట్టుగా జీవితం గడుపుతున్న దీప్‌సింగ్ ను రాజస్థాన్ లో అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం గుజరాత్ కు తరలించారు. 

Updated Date - 2020-07-12T23:02:57+05:30 IST