Abn logo
Nov 29 2020 @ 23:42PM

హౌసింగ్‌ బోర్డు కాలనీలో చోరీ

ఏలూరు క్రైం, నవంబరు 29: తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి తాళం వేసి  ఆస్పత్రికి వెళ్లి మరుసటి రోజు వచ్చేటప్పటికీ దొంగలు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. ఏలూరు సమీపంలోని వట్లూరు హౌసింగ్‌ బోర్డు కాలనీలో 1వ రోడ్డులో రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఈడా శ్రీహరిరావు తన కు టుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉండ డంతో విజయవాడనకు తీసుకెళ్లి తిరిగి శనివారం రాత్రి వచ్చారు. వచ్చేట ప్పటికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోనే మూడు కాసుల నల్లపూ సల గొలుసు, ఐదు కాసుల నాన్‌తాడు గొలుసు, వెండి కుందులు, కొంత నగదు అపహరణకు గురైనట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ మూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement