ఉరవకొండలో పట్టపగలే దోపిడీ

ABN , First Publish Date - 2022-01-20T06:15:11+05:30 IST

పట్టణంలోని సీవీవీ నగర్‌లో బుధవారం పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు అశ్వత్థమ్మను గుర్తుతెలియని దుండగులు కత్తులతో బెదిరించి, బంగారు నగలను దోచుకెళ్లారు.

ఉరవకొండలో పట్టపగలే దోపిడీ

వృద్ధురాలిని కత్తులతో బెదిరించి, నగల అపహరణ

ఉరవకొండ, జనవరి 19: పట్టణంలోని సీవీవీ నగర్‌లో బుధవారం పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు అశ్వత్థమ్మను గుర్తుతెలియని దుండగులు కత్తులతో బెదిరించి, బంగారు నగలను దోచుకెళ్లారు. సీవీవీ నగర్‌లో పోతుల మల్లికార్జున కుటుంబం నివాసముంటోంది. ఇం ట్లోని వారు పనుల నిమిత్తం బయటకెళ్లగా.. అశ్వత్థమ్మ మాత్రమే ఉంది. దీనిని అదునుగా తీసుకున్న గుర్తుతెలియని దుండగులు ఆలయానికి విరాళం ఇవ్వాలంటూ ఇం ట్లోకొచ్చారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి, ఆమె ఒంటిపై ఉన్న 4 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. చేతికున్న బంగారు గొలుసును లాగేందుకు యత్నించగా వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడం చూసి దుండగులు పరారయ్యారు. కాలనీలో దేవాలయాలకు విరాళాలు అడుగుతూ ఇద్దరు వ్యక్తులు తిరిగారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌, ఎస్‌ఐ రమే్‌షరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితురాలి నుంచి వివరాలను ఆరాతీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


వరుస చోరీలతో జనం బెంబేలు

పట్టణంలో ఇటీవల వరస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పట్టపగలే దోపిడీకి దిగుతుండడం వారిని కలవరపెడుతోంది. ఈ నెల 17వ తేదీన కణేకల్లు క్రాస్‌లో ఓ దుకాణానికి వెనుక వైపున రేకును కత్తిరించి, చోరీ చేశారు. గతేడాది డిసెంబరు 6వ తేదీన ఆమిద్యాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బం గారు, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేసుకెళ్లారు. దీం తో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. వరుస చోరీలు అవుతున్నా.. పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐడీ పార్టీ పోలీసులున్నా నిఘాపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అసాంఘిక కా ర్యకలాపాలపై దృష్టి సారించేందుకు సర్కిల్‌ పరిధి నుంచి ఐదుగురు ఐడీ పార్టీ పోలీసులను నియమించారు. అయి నా ప్రయోజనం లేదని జనం నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చోరీలను అరికట్టేందుకు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-01-20T06:15:11+05:30 IST