కరోనా వైరస్ దెబ్బకు చిత్ర పరిశ్రమ కుదేలైంది. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఏప్రిల్లో మూతపడిన థియేటర్ తలుపులు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా సోమవారం నుంచి మరికొన్ని సడలింపులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ప్రజారవాణాకు అనుమతిచ్చారు. అలాగే, అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీన మరోమారు లాక్డౌన్ ఆంక్షల సడలింపులపై ముఖ్యమంత్రి స్టాలిన్ వైద్యనిపుణులతో సమీక్ష నిర్వహించనున్నారు.
అపుడైనా సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి స్తారో లేదోనన్న సందేహం కోలీవుడ్లో నెలకొంది. సినిమా థియేటర్లు మూతపడడంతో దాదాపు 50కి పైగా చిత్రాల విడుదల ఆగిపోయింది. జూలై నెలలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి లభించ వచ్చని భావిస్తున్న కొందరు బడా హీరోలు తమ చిత్రాలను ఆగస్టు 15న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతివ్వలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీపరిశ్రమకు చెందిన పెద్దలు ఒక్కతాటిపై నిలబడి సినిమాటో గ్రాఫీ మంత్రి లేదా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయకపోవడం అం దుకు ఓ కారణమై వుండొచ్చని ఓ వర్గం అభిప్రాయడుతోంది. కానీ, ప్రభుత్వ వర్గాలు మాత్రం కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే థియేటర్లకు అనుమతి ఇవ్వడం లేదని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చెబుతున్నాయి.