Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 02 Dec 2021 22:23:58 IST

ఏపీలో ‘అఖండ’ బెనిఫిట్ షో.. థియేటర్ సీజ్ చేసిన అధికారులు

twitter-iconwatsapp-iconfb-icon

ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా పరిశ్రమకు కొన్ని నియమ, నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. తమ కనుసన్నల్లోనే చిత్ర పరిశ్రమ ఉండాలి అనేలా కొన్ని కొత్త రూల్స్‌ని ఏపీలో ప్రవేశ పెట్టారు. అందులో ఒకటి నో బెనిఫిట్ షో స్. ఈ నియమాన్ని ధిక్కరించి గురువారం విడుదలైన బాలయ్య ‘అఖండ’ చిత్రానికి బెనిఫిట్ షో వేసినందుకు గాను.. అధికారులు ఓ థియేటర్‌ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. 


కృష్ణాజిల్లా మైలవరంలోని సంఘమిత్ర అనే థియేటర్‌ని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా గురువారం తెల్లవారు జామున బెనిఫిట్ షో వేసినందుకు థియేటర్‌ని ఎమ్మార్వో సీజ్ చేసి, థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కాగా, రూల్స్ బ్రేక్ చేసి బెనిఫిట్ షో ప్రదర్శించిన స్క్రీన్‌ను మాత్రమే సీజ్ చేశామని, మరో స్ర్ర్కీన్‌లో సినిమా నడుస్తుందని ఎమ్మార్వో తెలియజేశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement