నేనే గొప్ప.. నన్ను మించినవారు ఎవరూ లేరనుకుంటే.. చివరికి భంగపాటు తప్పదు. ఈ సత్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంగా బోధపడి ఉంటుంది. ఇది మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుంది. కొన్ని భారీ జంతువులు తమ కంటే చిన్న జంతువులపై దాడి చేయబోయి.. చివరికి తోక ముడిచిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. తాజాగా జీబ్రాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దాడి చేయడానికి వచ్చిన సింహానికి, ఈ జీబ్రా చివరికి చుక్కలు చూపించింది.
అడవిలో సెలయేటి వద్దకు ఓ జీబ్రా నీరు తాగేందుకు వస్తుంది. అదే సమయంలో పొదల మాటున ఓ సింహం దాడి చేసేందుకు మాటు వేసి ఉంటుంది. సింహాన్ని గమనించిన జీబ్రా.. వేగంగా పరుగందుకుంటుంది. ఆ వెనుకే సింహం కూడా జీబ్రాను వెంబడిస్తుంది. తర్వాత ఒక్కసారిగా జీబ్రాపైకి పంజా విసురుతుంది. అయితే జీబ్రా వెనుక కాళ్లతో పవర్ఫుల్ పంచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో సింహం ఒక్కసారిగా తోక ముడుస్తుంది. జీబ్రా అక్కడి నుంచి వెళ్లిపోగానే సింహం దిగాలుగా వెనుదిరగడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి