యువత దేశాభివృద్ధికి పాటుపడాలి

ABN , First Publish Date - 2022-01-26T05:02:02+05:30 IST

యువత దేశాభివృద్ధికి పాటుపడాలని తహసీల్దార్‌ జయంత్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.

యువత దేశాభివృద్ధికి పాటుపడాలి
భీమ్‌గల్‌ తహసీల్‌ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేస్తున్న సిబ్బంది

ధర్పల్లి, జనవరి 25: యువత దేశాభివృద్ధికి పాటుపడాలని తహసీల్దార్‌ జయంత్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.

ఓటు హక్కు కలిగి ఉండాలి

మోపాల్‌: 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్‌ వీర్‌సింగ్‌ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ  తహసీల్దార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మంచి నాయకులను ఎన్నుకోవాలి

ఇందల్‌వాయి: ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకోవాలని ఎంపీపీ రమేష్‌నాయక్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చంద్రాయన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతిజ్ఞ చేశారు. ఇందల్‌వాయి తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రమేష్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లలిత, ఉప సర్పంచ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ ఓటర్ల నమోదు దినోత్సవం 

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓ టర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. 

భీమ్‌గల్‌ మండలంలో..

భీమ్‌గల్‌: మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో మంగవారం జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని రెవెన్యూ సిబ్బంది నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ కర్ణమయ్య, ఆర్‌ఐ ధనుంజయ్‌ పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో..

కమ్మర్‌పల్లి: పలు గ్రామాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ప్రతీ పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లతో ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సుర్బిర్యాల్‌ గ్రామంలో..

ఆర్మూర్‌రూరల్‌: సుర్బార్యిల్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించా రు. ఈ సందర్భంగా ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో సర్పంచ్‌ సవిత గణేష్‌, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో..

నవీపేట: మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో మంగళవారం అధికారులు ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లత, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:02:02+05:30 IST