యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-26T04:12:16+05:30 IST

యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్య సాధనకు పాటుపడాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.

యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌

- ఎమ్మెల్యే రేఖానాయక్‌
జన్నారం, జనవరి 25: యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్య సాధనకు పాటుపడాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.  మండలంలోని కవ్వాల గ్రామంలో మంగళవారం  అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం  ఆమె మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని రిజర్వేషన్‌లతో ఎంతో మంది బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని చెప్పారు.  అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. అట్టడుగు వర్గాలకు దారి చూపిన వ్యక్తి మహానీయుడు అని కొనియాడారు. అనంతరం చర్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. బాదంపల్లి గ్రామానికి చెందిన కాసు నారాయణకు రూ. 60 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు.  కార్యక్రమంలో అంబేద్కర్‌ సభ అధ్యక్షుడు మహ్మద్‌ రియాజుద్దీన్‌, ఎంపీపీ మాదాడి సరోజన,  కో ఆప్షన్‌ మున్వర్‌ ఆలీ, సర్పంచు రాథోడ్‌ లక్ష్మీ, ఎంపీటీసీ సౌజన్య, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాజారాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ భరత్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కవ్వాల టైగర్‌జోన్‌లో ఎమ్మెల్యే పర్యటన
 కవ్వాల టైగర్‌జోన్‌లోని జన్నారం రేంజ్‌లోని బైసన్‌కుంట అటవీ ప్రాంతంలో అటవీ సఫారీలో  ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంగళవారం పర్యటించారు. బైసన్‌కుంట వద్ద అడవిలో చేసిన అభివృద్ధి పనులతో పాటు పర్యాటకంగా తీర్చిదిద్దిన ప్రాంతాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కవ్వాల అభయారణ్యానికి ఎంతో భవిష్యత్‌ ఉందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.  కార్యక్ర మంలో ఎంపీపీ మాదాడి సరోజన, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజారాంరెడ్డి, కో ఆప్షన్‌ మున్వర్‌ ఆలీ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ భరత్‌కుమార్‌, ఎండీ రియాజుద్దీన్‌, జనార్దన్‌, ,నర్సగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, అటవీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:12:16+05:30 IST