Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 30 Dec 2021 21:38:13 IST

8మంది అత్యాచారం చేశారంటూ యువతి ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ నిజాలు తెలియడంతో పోలీసుల షాక్..

twitter-iconwatsapp-iconfb-icon
8మంది అత్యాచారం చేశారంటూ యువతి ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ నిజాలు తెలియడంతో పోలీసుల షాక్..

కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో.. కొన్నిసార్లు అనూహ్య మలుపులు చోటు చేసుకుంటూ ఉంటాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. తనపై ఎనిమిది మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. అయితే అసలు విషయం తెలిసి చివరకు వారు షాక్ అయ్యారు. ఏం జరిగిందంటే..

హర్యానా గురుగ్రామ్‌కు చెందిన 22 ఏళ్ల ఓ యువతి.. తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తనపై ఎనిమిది మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే చివరికి వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. ప్రేమ పేరుతో పలువురికి వల వేయడం, అందినకాడికి నగదును డిమాండ్ చేయడమే ఆమె వృత్తి అని తెలిసింది. మొదటగా యువకులతో ప్రేమ పేరుతో మాట్లాడటం. కొన్నాళ్లకు డబ్బులు డిమాండ్ చేయడం ఆమెకు అలవాటు. ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే.. వారిపై అత్యాచార కేసులు నమోదు చేయించడం వంటివి చేస్తుంటుందని తెలుసుకున్నారు.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఈ క్రమంలో ఇటీవల 8మందిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించింది. అయితే డబ్బులు డిమాండ్ చేయడంతో వారు నిరాకరించారు. దీంతో వారిపై అత్యాచార ఆరోపణలు చేసిందని ఏసీపీ(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. ఈ యువతి తల్లి, నరేందర్ యాదవ్ అనే యువకుడు కూడా సహకరించాడని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితురాలిని బుధవారం కోర్టుకు హాజరుపరిచి, అనంతరం జ్యుడీషియల్‌ కస్టడికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్.. బాలికలతో ఏం చేయించిస్తున్నారో తెలుసా.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..videoఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా.. చేయి లేదని కుంగిపోలేదు.. ఇతడి ఆత్మవిశ్వాసం ముందు... ఓటమి కూడా తలవంచాల్సిందే.. videoఎయిర్‌పోర్టులో దిగిన మహిళ.. చెకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిన వైనం.. చివరకు అసలు విషయం తెలిసి..తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.