లక్షల విలువ చేసే వస్తువులను కొన్న యువతి.. తీరా ఇంటికి తీసుకొచ్చి తెరచి చూస్తే..

ABN , First Publish Date - 2021-12-26T03:00:56+05:30 IST

ఒక్కోసారి జరిగే ఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేం. ఎవరో మంత్రం వేసినట్లుగా వస్తువులు తారుమారవుతుంటాయి. మ్యాజిక్ చేసే సందర్భాల్లో కూడా ఆశర్యం వేస్తూ ఉంటుంది. యూఎస్‌లో ఓ మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది..

లక్షల విలువ చేసే వస్తువులను కొన్న యువతి.. తీరా ఇంటికి తీసుకొచ్చి తెరచి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

ఒక్కోసారి జరిగే ఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేం. ఎవరో మంత్రం వేసినట్లుగా వస్తువులు తారుమారవుతుంటాయి. మ్యాజిక్ చేసే సందర్భాల్లో కూడా ఆశర్యం వేస్తూ ఉంటుంది. యూఎస్‌లో ఓ మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. విహారయాత్రకు వెళ్లిన ఆమె.. తన మిత్రులు, బంధువుల కోసం లక్షలు ఖర్చు చేసి.. పలు బహుమతులను కొనుగోలు చేసింది. తీరా ఇంటికి తీసుకొచ్చి తెరచి చూసి.. అవాక్కయింది. అసలేం జరిగిందంటే..


యూఎస్‌కి చెందిన ఓ మహిళ విహారయాత్ర కోసం యూరప్‌ వెళ్లింది. ఇటలీలో సుమారు 11 రోజులు గడిపింది. కొన్ని రోజులు వ్యాపారం నిమిత్తం ప్యారిస్‌లో గడిపింది. ఈ క్రమంలో స్నేహితులు, బంధువుల కోసం దాదాపు రూ.2లక్షలు ఖర్చు చేసి, పలు బహుమతులను కొనుగోలు చేసింది. యాత్రను పూర్తి చేసుకుని, ఇంటికి వచ్చాక.. సూట్‌కేసుని తెరచి చూసి అవాక్కయింది. అందులో ఖరీదైన గిఫ్టులకు బదులుగా కుక్క బిస్కెట్లు, పాత దుస్తులు, షేవింగ్ క్రీం తదితరాలు ఉండడం చూసి షాక్ అయింది.

జీవితాన్ని మార్చేసిన తొమ్మిది ప్రశ్నలు.. రూ.కోటి ప్యాకేజీతో జాబ్ ఇచ్చేందుకు Amazon అడిగిన ప్రశ్నలివే..!


షాక్ నుంచి తేరుకున్న ఆమె.. తర్వాత ఆలోచిస్తే, తన సూట్‌కేసు తారుమారైనట్లుగా తెలుసుకుంది. అనంతరం ఇదే విషయాన్ని సదరు ఎయిర్‌లైన్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. విచారించిన అధికారులు మహిళ వస్తువులు తారుమారవడంపై క్షమాపణలు తెలియజేసింది. త్వరగా సమస్య పరిష్కరించి, ఆమె వస్తువులను అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.

పాత దుస్తులను అమ్మేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తే.. రూ.1.9 లక్షలు మటాష్.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2021-12-26T03:00:56+05:30 IST