కడప(క్రైం), జనవరి 16: సినిమాకు తీసుకెళ్లలేదని యాడికి జైశ్రీ(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తాలూక ఎస్‌ఐ హుస్సేన్ తెలిపారు. పోలీసులు అందించిన వివరాల్లోకెళితే.... కడప నగరం ఏఎ్‌సఆర్ నగర్ ఆచారి కాలనీ వాసి పవన్‌కుమార్ ఆచారి నాగరాజుపేటలోని బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి పదేళ్ల కిందట కడపకు చెందిన యాడికి జైశ్రీతో వివాహమైంది. కాగా శనివా రం మ్యాట్నీ షోకు తీసుకెళతానని చెప్పిన భర్త ఒక్కడే వెళ్లడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.