Viral Video: చేపలకు గాలం వేస్తే.. దొరికింది చూసి దిమ్మ తిరిగింది...

ABN , First Publish Date - 2021-10-03T01:43:25+05:30 IST

చేపల వేట కొందరికి సరదా అయితే.. మరికొందరికి జీవనోపాధి. కొందరు సరదాగా గాలానికి ఎర వేసి.. చేపలు పడుతూ ఉంటారు. ఆ పూటకు సరిపడా చేపలు దొరికితే ఫుల్ ఖుషీ అవుతారు. అయితే గాలం వేసే సమయంలో చాలా ఓపిక ఉండాలి. ఒక్కోసారి ఎంత

Viral Video: చేపలకు గాలం వేస్తే.. దొరికింది చూసి దిమ్మ తిరిగింది...

చేపల వేట కొందరికి సరదా అయితే.. మరికొందరికి జీవనోపాధి. కొందరు సరదాగా గాలానికి ఎర వేసి.. చేపలు పడుతూ ఉంటారు. ఆ పూటకు సరిపడా చేపలు దొరికితే ఫుల్ ఖుషీ అవుతారు. అయితే గాలం వేసే సమయంలో చాలా ఓపిక ఉండాలి. ఒక్కోసారి ఎంత సేపటికీ చేపలు చిక్కవు. పెద్ద చేపలు చిక్కిన సమయంలో.. అంతవరకూ ఎదురు చూసిన కళ్లల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి చేపల కోసం గాలం వేశాడు. దొరికిన దాన్ని చూసి అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన ఓడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఓ వ్యక్తి చేపల కోసం గాలం వేశాడు. పెద్ద చేప చిక్కలాని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అంతలో కొక్కెం కదిలింది. అది బరువుగా ఉండడంతో.. పంట పండింది అనుకున్నాడు. తీరా పైకి లాగి చూస్తే.. మనోడికి దిమ్మతిరిగింది. చేప చిక్కుతుందనుకుంటే.. పెద్ద పాము చిక్కింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. బోనస్‌గా ఇంకో పాము కనిపించింది. గాలానికి చిక్కిన పామును కాపాడాలని మరో పాము ఎగిరిపడుతోంది. ఇంకా నయం మొత్తం పైకి లాగుంటే.. రెండు పాములు మెడకు చుట్టుకునేవి. లేచిన వేళావిశేషం బాగుందనుకున్నాడు. బతుకు జీవుడా అంటూ ఇంటికి పయనమయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.



Updated Date - 2021-10-03T01:43:25+05:30 IST