Abn logo
Sep 17 2021 @ 15:17PM

బుర్ఖాలో కాలేజీలోకి వెళ్లిన కుర్రాడు.. నడక తీరు, చెప్పులను చూసి ఓ మహిళా ఉద్యోగికి డౌట్.. చివరకు సీన్ రివర్స్..!

అది మహిళా కళాశాల.. అక్కడ చదువుతున్న తన స్నేహితురాలిని కలిసేందుకు అతను మాస్టర్ ప్లాన్ వేశాడు.. బుర్ఖా ధరించి ధైర్యంగా లోపలికి ప్రవేశించాడు.. స్నేహితురాలు ఉన్న గదిలోకి ప్రవేశించే సమయంలో ఓ మహిళా ఉద్యోగి కన్ను అతడిపై పడింది.. అతడి నడక తీరు, చెప్పులను చూసి ఆమెకు డౌట్ వచ్చింది.. సెక్యూరిటీని పిలిచి అతడిని తనిఖీ చేయించగా అసలు విషయం బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఈ ఘటన గురువారం జరిగింది. 


ఇవి కూడా చదవండి

నగలు అమ్మేద్దాం.. అని ఓ భర్త ప్రపోజల్.. నో చెప్పిన భార్య.. చివరకు..



అదే జరిగితే లీటర్ పెట్రోల్ ధర 57 రూపాయలు మాత్రమే..!

బుర్హాన్‌పూర్‌లోని సేవా సదన్ కళాశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు బుధ్వారా నివాసి అయిన మొహ్సిన్ సాహాబ్ బుర్ఖా ధరించి ప్రవేశించాడు. అతడి నడకతీరు, వేసుకున్న బూట్లు చూసి ఓ మహిళా ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఎందుకంటే మొహ్సిన్ పురుషుల బూట్లు ధరించి ఉన్నాడు. ఆమె వెంటనే సెక్యూరిటీని పిలిపించి విచారించింది. 


అతడు తొలుత ముసుగు తీయడానికి నిరాకరించాడు. తర్వాత ముసుగు తీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం తన స్నేహితురాలిని కలిసేందుకే తను మారు వేషంలో వచ్చానని మొహ్సిన్ చెబుతున్నాడు. 

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...