రోడ్డు పక్కన బండి తీయమన్నందుకు... Trafic పోలీసునే..

ABN , First Publish Date - 2021-10-02T03:48:07+05:30 IST

ప్రస్తుతం కొందరు యువత ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మరికొందరు యువకులైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. బీహార్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటనే ఇందుకు ఉదాహరణ. బీహార్‌లో ఓ యువకుడు శుక్రవారం రోడ్డు పక్కన

రోడ్డు పక్కన బండి తీయమన్నందుకు... Trafic పోలీసునే..

ప్రస్తుతం కొందరు యువత ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మరికొందరు యువకులైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. బీహార్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటనే ఇందుకు ఉదాహరణ. బీహార్‌లో ఓ యువకుడు శుక్రవారం రోడ్డు పక్కన బైకు నిలిపాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ట్రాఫిక్‌ పోలీసు దాన్ని గమనించాడు. ఆ యువకుడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాడు. బండి పక్కన పెట్టమని మందలించాడు. 


దీంతో ఆగ్రహం చెందిన ఆ యువకుడు .. పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మరింత ఆగ్రహంతో పోలీసును నెట్టేసి మరీ దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు యువకుడిని పక్కకు లాక్కెళ్లారు. దాడికి గురైన పోలీసు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో బైక్‌ను రోడ్డుపైనే వదిలేసి ఆ యువకుడు పారిపోయాడు. ట్రాఫిక్‌ పోలీసు ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-02T03:48:07+05:30 IST