డిసెంబరు 21 రాత్రి అత్యంత సుదీర్ఘం

ABN , First Publish Date - 2021-12-21T20:48:35+05:30 IST

సంవత్సరంలో రెండుసార్లు వచ్చే అయనం (సొల్‌స్టిస్

డిసెంబరు 21 రాత్రి అత్యంత సుదీర్ఘం

న్యూఢిల్లీ : సంవత్సరంలో రెండుసార్లు వచ్చే అయనం (సొల్‌స్టిస్) ప్రారంభంలో పగలు కానీ, రాత్రి కానీ సుదీర్ఘంగా ఉంటుంది. చలికాలపు సొల్‌స్టిస్ ఉత్తరార్ధ గోళంలో చలికాలం ప్రారంభానికి సూచిక. ఈ ప్రారంభం రోజున రాత్రి సంవత్సరం మొత్తం మీద రాత్రులలో చాలా సుదీర్ఘ సమయం ఉంటుంది. అదే రోజున దక్షిణార్ధ గోళంలో వేసవి ప్రారంభమవుతుంది. అదే రోజు పగటి సమయం సంవత్సరం మొత్తం మీద పగటి సమయాల్లో సుదీర్ఘంగా ఉంటుంది. 


మనం చలికాలపు సొల్‌స్టిస్‌కు సమీపంలో ఉన్నాం కాబట్టి పగటి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డిసెంబరు 21 - డిసెంబరు 22 మధ్యలో ఉత్తరార్ధ గోళంలో రాత్రి సమయం సుదీర్ఘంగా, పగటి సమయం తక్కువగా ఉంటాయి. దక్షిణార్ధ గోళంలో ఈ పరిస్థితులు జూన్ 20-21 మధ్య ఏర్పడతాయి. దీనికి కారణం సూర్యుడు ఈ ప్రాంతాలకు దూరంగా మకర అయన వృత్తంలో ఉండటమే. . సొలిస్టిస్ సమయంలో భూమి అక్షాంశం 23.5 డిగ్రీలు వాలుతుంది. 


ఉత్తరార్ధ గోళంలో వింటర్ సొలిస్టిస్ 2021 డిసెంబరు 21 రాత్రి 9.29 గంటలకు జరుగుతుంది. సాధారణంగా డిసెంబరు 21న ఈ సొలిస్టిస్ జరుగుతుంది, అయితే డిసెంబరు 22న కూడా అప్పుడప్పుడూ జరుగుతుంది. వింటర్ సొలిస్టిస్‌ను సూర్యుని తిరిగి రాకగా పేర్కొంటారు. భారత దేశంలో పగటి సమయం తక్కువగా ఉండే రోజుతో ముగిసే నెలకు గుర్తుగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. సొలిస్టిస్‌ను చైనా, జపాన్ సంస్కృతుల్లో కూడా సంబరంగా జరుపుకుంటారు. 


Updated Date - 2021-12-21T20:48:35+05:30 IST