రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన వైసీపీ

ABN , First Publish Date - 2022-06-30T05:43:02+05:30 IST

రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి... ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాగా వైసీపీ మార్చేసిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన వైసీపీ
ప్రజలకు కరపత్రాలను అందజేస్తున్న పరిటాల శ్రీరామ్‌


‘బాదుడే- బాదుడు’లో పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, జూన 29: రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి... ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాగా వైసీపీ మార్చేసిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ మండిపడ్డారు. పట్టణంలోని నేసేపేటలో  బుధవారం బాదుడే- బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరిస్తూ పరిటాల శ్రీరామ్‌ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాకమునుపు అలవికానీ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలపై బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటి ధరలను విపరీతంగా పెంచిందన్నారు. ఈ మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత చార్జీల ను, మూడు సార్లు ఇంటిపన్నులను పెంచి ప్రజలపై మోయలేని బారం మోపిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చెత్తపై పన్ను పెంచి చెత్త ముఖ్యమంత్రిగా రికారు ్డసృష్టించారన్నారు. చంద్ర బాబునా యుడు హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తే.... వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఇక సంక్షేమం పేరుతో ప్రజలకు పప్పులు, బెల్లాలు పెడుతూ అందినకాటికి వైసీపీ నాయకులు పెద్దఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. ఈ మూడేళ్ల కనీసం రోడ్లపై గుంతలను పూడ్చలేదన్నారు. ధర్మవరంలో అధికంగా ఉన్న చేనేతల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్‌ మాజీ చైర్మన కాచర్ల కంచన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య,  మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు, నాయకులు బోయ రవిచంద్ర, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన్న, పరిశే సుధాకర్‌, భీమనేని ప్రసాద్‌నాయుడు, గరుగు వెంగప్ప, రుద్రారవి, అంబటి సనత, క్రిష్ణాపురం జమీర్‌అహమ్మద్‌, రాంపురం శీన, గంగారపు రవి, నాగూర్‌ హుస్సేన, బాబూఖాన, చిగిచెర్ల రాఘవరెడ్డి, బొట్టు కిష్ట, గొసల శ్రీరాములు, చిన్నూరు విజయ్‌చౌదరి, సంగాల బాలు, చీమల రామాంజి, అత్తర్‌ రహీంబాషా, మిడతల యుగంధర్‌, పూలకుంట్ల మహేశ, కేతినేని రాజు, సత్యనారాయణ, ఓంకార్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:43:02+05:30 IST