రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-27T05:08:50+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు.

రాష్ట్రాన్ని  డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన వైసీపీ ప్రభుత్వం
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న గాజుల ఖాదర్‌బాషా

 టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా

రాయచోటిటౌన్‌, అక్టోబరు26: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా దాని మూలాలు, ఏపీలో ఉం టున్నాయని, ఆయా రాష్ర్టాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కడా లేని లిక్కర్‌ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని ఆరోపించారు. మద్యపాన నిషేధం పేరుతో భారీగా రేట్లు పెంచేశారని, మాఫియాగా ఏర్పడి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.  రాష్ట్రంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మైనింగ్‌ మాఫియాలాగా డ్రగ్స్‌ కూడా సిండికేట్‌ అయ్యిందన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి అబుజర్‌, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఇనాం, మండల మాజీ ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ పట్టణ మండల అతావుల్లా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:08:50+05:30 IST