ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-29T05:07:47+05:30 IST

పన్నుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
గోపగుడిపల్లెలో సమస్యలను తెలుసుకుంటున్న రమే్‌షకుమార్‌రెడ్డి

రామాపురం, సెప్టెంబరు 28: పన్నుల పేరుతో వైసీపీ ప్రభుత్వం  ప్రజల నడ్డి విరుస్తోందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.   మండలంలోని గొల్లపల్లె, నాగరాజు పల్లె, గాజులపేట, హరిజనవాడ, గోపగుడిపల్లె, కాంపల్లె, కల్పనాయుని చెరువు పంచాయతీ మూలపలెలో బుధవారం ఆయన బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  రంజాన్‌ తోఫా, దుల్హన్‌, చంద్రన్న పెళ్లికానుక, సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసేసిం దని, అవన్నీ మళ్లీ కావాలంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో కళాశాల యజమానులు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను నీరుగార్చడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పటి  ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును చెరి పేస్తున్నారన్నారు. ఇసుక, మట్టి దోపిడీ,  ప్రభుత్వ భూముల కబ్జాలు అధి కమయ్యాయన్నారు.  ప్రతి నియోజకవర్గంలో 40 వేల మందిని టీడీపీలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ  చైర్మన్‌ మద్దిరేవుల రమేష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి బాలిశెట్టి చంద్రమౌళి, రాజం పేట పార్లమెంట్‌ తెలుగు యువత కార్యదర్శి రాజేష్‌, ఏపీ బెస్త కులాల సాధికారిక కమిటీ మెంబర్‌ చంద్రశేఖర్‌, మల్లికార్జున, రాజానాయక్‌, బాల కృష్ణ, రాంమోహన్‌రెడ్డి, వెంకట్రామరాజు, మాజీ వీఆర్‌వో గాలివీటి నరేం దర్‌రెడ్డి, బండారు వెంకటేష్‌, చిన్న రమణ, వెంకట్రమణ, శశికుమార్‌, పుల్ల య్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

టీడీపీ కార్యకర్త మృతికి నివాళి

లక్కిరెడ్డిపల్లె: అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త ఆదిమూలం సురేష్‌ (45) బుధవారం మృతి చెందారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌ రెడ్డి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు వాసుదేవుడు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T05:07:47+05:30 IST