ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-12T05:00:09+05:30 IST

నిత్యావసర వస్తువుల ధర లు, కరెంట్‌ చార్జీలు, బస్సు చార్జీలు, పెట్రోలు, తాజాగా చెత్తపన్నులను పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌ అన్నారు.

ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
పెద్దివారిపాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

టీడీపీ మండల అధ్యక్షుడు షంషుద్దీన్‌ ధ్వజం

పెద్దివారిపాలెం(పర్చూరు), ఆగస్టు 11: నిత్యావసర వస్తువుల ధర లు, కరెంట్‌ చార్జీలు, బస్సు చార్జీలు, పెట్రోలు, తాజాగా చెత్తపన్నులను పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌ అన్నారు. గురువారం మండలంలోని పెద్ది వారిపాలెంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెట్టి రోజురోజుకు నిత్యా వసర వస్థువుల ధరలను పెంచి ప్రజలను ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తున్నారని అన్నారు. ఒక చేత్తో సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చె బుతూ మరోపక్క అదనపు భారం మోపుతో ప్రజలను అయోమయా నికి గురిచేస్తుందన్నారు. తొలుత గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. తదనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ఎ త్తిచూపుతూ పెంచిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కరప త్రాలు పంచుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి మామిడి పాక హరిప్రసాద్‌, మానం హరిబాబు, రావి శ్రీనివాసరావు, కొడాలి వెంకటేశ్వరరావు,  ఎల్లమంద, బ్రహ్మయ్య, సాంబశివరావు, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, శ్రీరాం వెంకటసుబ్బారావు, వీరనారాయణ, హైటెక్‌ సుభానీ తదితరు లు పాల్గొన్నారు. 


అభివృద్ధిని అటక్కెంచిన ప్రభుత్వం 

చినగంజాం, ఆగస్టు 11:  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని అటకెక్కించిందని టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య అన్నారు. కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని భాగ్య నగర్‌, మూలగానివారిపాలెం గ్రామాల్లో టీడీపీ సీనియర్‌ నాయకుడు రాజు వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో గురువారం బాదుడే బాదుడు కార్యర కమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి బటన్లు నొక్కడానికే బయటకు వస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోనికి వచ్చాక అన్నిరకాల ధరల్ని పెంచి ఏ విధంగా భారం మోపుతున్నారో కరపత్రాలు అందజేసి వివరించారు. 

కార్యక్రమంలో టీడీపీ నాయకులు సయ్యద్‌ అబ్దుల్‌కలాంఅజాద్‌, సందు శ్రీనివాసరావు, దేవతోటి నాగరాజు, టి.జయరావు, నరహరి శ్రీని వాసరావు, కేశనపల్లి శ్యాంబాబు, పర్వతరెడ్డి పార్థసారిధి, ఏడకొండలు, ఉదయ్‌బాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T05:00:09+05:30 IST