Abn logo
Oct 25 2021 @ 00:41AM

వైసీపీ ప్రభుత్వం మత్తులో జోగుతోంది

మా జోలికి వస్తే వదిలిస్తాం: టీడీపీ

కదిరి,  అక్టోబరు  24: వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్‌ మత్తులో జోగుతోందని టీడీపీ జోలికి వస్తే మత్తుదించేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జనాగ్రహ దీక్ష పేరుతో పార్టీని, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను ఇష్టారాజ్యంగా వైసీపీ నాయకులు మా ట్లాడటంపై టీడీపీ నాయకులు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ మత్తులో ముంచేస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి అభివృద్ధి మరచి, టీడీపీ నాయకులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని అవి మాని అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు దౌర్జన్యకాండ సాగిస్తున్నారని, కొం త మంది పోలీసులు కూడా వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి ఒక్క రికి తగిన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. మా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్‌ గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి చేసి, మీరే జనాగ్రహ దీక్ష పేరుతో నాటకాలు ఆడటం ప్రజలు గమనిస్తున్నార న్నారు. ఆ జనమే మీపై తొందరలో ఆగ్రహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్‌ ఆల్ఫాముస్తఫా, టీడీపీ నాయకులు రాజశేఖర్‌బాబు, కాటం మనోజ్‌, డైమం డ్‌ ఇర్ఫాన్‌, పాల రమణ, పాశం వెంకటరమణ, ఇమ్రాన్‌, శివశంకర్‌, వడ్డెబాబు, బాబ య్య, అత్తహార్‌ తదితరులు పాల్గొన్నారు.