పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న సింగారెడ్డి
డీజల్ ధరలను కేంద్రం తగ్గించినా రాష్ట్రం దోచుకుంటోంది
దోచుడు తగ్గించకపోతే ఉద్యమం తప్పదు
కేంద్ర పథకాల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ సింగారెడ్డి
కడప మారుతీనగర్, మే 28: ఒక్కచాన్స్ ఇవ్వాలం టూ ప్రజల ఓట్లతో గద్దె నెక్కిన ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ల పాలన లో గెలిపించిన ప్రజల ను దగా చేస్తున్నారని బీ జేపీ కేంద్రప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి విమ ర్శించారు. సామాన్య ప్రజలు కొని తినలేని పరిస్థితిలో ఇవాళ నిత్యావసర వస్తువులు సహా మిగతా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. శనివారం స్థానిక ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ ఎదురుగా గల ఆయన కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మాయమాటలు చెప్పిన జగనన్న అధికారంలోకి రాగానే ప్రజల నెత్తి న పన్నుల భారాన్ని మోపి కోట్లరూపాయలు దండుకుంటున్న తీరు దారుణమన్నారు. కేంద్రం లీటరు పెట్రోల్ ధరపై రూ 9.5, డీజల్‌పై రూ. 7 తగ్గించిందన్నారు. కాగా జగన్ సర్కార్ పెట్రో ధరలను తగ్గించకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. కడప ఖనిజాన్ని వాడుకుని సిమెంట్‌ను సృష్టించి కడపకు పొల్యూషన్, ఇతర రాష్ట్రాలకు సిమెంట్ అన్నట్లుగా ఉందన్నారు. సిమెంట్ కార్మాగార యాజమాన్యాలన్నీ సిండికేట్‌గా మారి సిమెంట్ ధరలను పెంచేశాయన్నారు. సిమెంట్, ఇసుక ధరలు పెరగ డం వలన పేదలు ఇల్లు నిర్మించుకోలేక, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నుల భారం తగ్గించకపోతే ప్రజలను చైతన్యం చేసి ఉద్యమ బాట పడతామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ యాదవ్, జిల్లా నాయకులు అనంతకేశవ, షిండేభాస్కర్, లక్ష్మణరావు పాల్గొన్నారు.