మార్కాపురంలో మాట్లాడుతున్న నారాయణరెడ్డి
మార్కాపురం, మే 23 : పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదలపై బాదుడే బాదుడుతో దోచుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.‘బాదుడే బాదుడు’లో భాగంగా సోమవారం మార్కాపురం పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ కార్యకర్తలతో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదలపై చెత్తపన్ను, ఇంటి పన్నులు వేసి నిత్యవసర ధరలు పెంచారన్నారు. ఇసుక , సిమెంట్, ఇనుము, రిజిస్టేషన్ చార్జీలు పెంచి సమాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఏపీలో నవరత్నాల ముసుగులో పేదలను వైసీపీ ప్రభుత్వం నవబాదులు బాదుతోందని అన్నారు విద్యుత్ చార్జీలు పెం చి వైసీపీ తన నిజం స్వరూపం బయట పెట్టిందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటి మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లిఖార్జున, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు డాక్టరు మౌలాలి, టీడీపీ నాయకులు కొప్పుల శ్రీనివాసులు, పి మల్లిఖార్జున, నాగూర్‌వలి, షేక్ మాబాషా, ఆంజనేయులు, అల్లూరయ్య, రామాంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.