క్రేన్‌ వైర్లు తెగి పడటంతో కూలీ మృతి

ABN , First Publish Date - 2022-05-26T07:08:27+05:30 IST

కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకో నందున పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన వలస కూలీ మృతి చెందింది. చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం..

క్రేన్‌ వైర్లు తెగి పడటంతో కూలీ మృతి

భూదాన్‌పోచంపల్లి, మే 25: కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకో నందున పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన వలస కూలీ మృతి చెందింది.  చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మందగట్ల గ్రామానికి చెందిన వీటి పద్మ(48), నరసింహ దంపతులు తమ ఇద్దరి పిల్లలతో భూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామశివారులోని బీఎస్‌సీపీఎల్‌ కంపెనీలో ఏడు నెలల నుంచి రోజువారి కూలీలుగా పనిచేస్తున్నారు. మంగళవారం మఽధ్యాహ్నం సిమెంట్‌ బ్రిక్స్‌ను నీటితో క్యూరింగ్‌ చేస్తుండగా.. లిఫ్టింగ్‌ పనులు చేస్తున్న క్రేన్‌ ఇనుప వైర్లు తెగి పద్మపై పడ్డాయి.  ఈ ప్రమాదంలో ఆమె కాలు పూర్తిగా తెగటంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం  హైదరాబాద్‌కు తరలి స్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించనందునే కూలీ పద్మ మృతిచెందింది. భర్త నరసింహ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 



Updated Date - 2022-05-26T07:08:27+05:30 IST