Abn logo
Sep 22 2021 @ 01:05AM

కలెక్టరేట్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూర ల్‌, సెప్టెంబర్‌ 21: నూతన కలెక్టరేట్‌ భవన పనులు త్వర గా పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అధికారులను ఆదేశించారు. భువన గిరి శివారులోని రాయిగిరిలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ పనులను ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సమావేశపుహాల్‌, వివిధ శాఖల అధికారులకు ఏర్పాటుచేస్తున్న ఛాంబర్‌లతోపాటు ఆవరణలో చేపడుతున్న గ్రీనరీ, మొక్కల పెంపకం తదితర పనులను పరిశీలించారు. ఆమెవెంట ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, ట్రాన్సకో ఎస్‌ఈ లింగారెడ్డి తదితరులున్నారు.