Abn logo
Jul 30 2021 @ 22:34PM

‘బృహత్‌ పల్లె ప్రకృతి వనం’ పనులను త్వరగా పూర్తి చేయాలి

పనుల వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌

తాండూర్‌, జులై 30: జిల్లాలో చేపట్టిన మెగా ప్రకృతి వనాల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం అచ్చలాపూర్‌ శివారులో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీ లించారు. వాకింగ్‌ ట్రాక్‌లు పూర్తి చేసి మొక్కలు నాటుతున్నారు. ఇందులో ఒకే రకం మొక్కలే కాకుండా పండ్ల మొక్కలను కూడా నాటాలని సూచించారు. పనుల్లో రాజీ పడకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో శశికళ, ఎంపీవో మొహినుద్దీన్‌, ఉపాధిహామీ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 

భీమిని: వడాలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను అదనపు కలె క్టరు ఇలా త్రిపాఠి పరిశీలించారు. మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించా లన్నారు. ఎంపీడీఓ జవహర్‌లాల్‌, విజయ్‌ప్రసాద్‌, భాస్కర్‌రావు ఉన్నారు.