ఆలయాలకు వెళ్లే మహిళలే టార్గెట్‌

ABN , First Publish Date - 2020-02-20T09:19:34+05:30 IST

ఇద్దరూ స్నేహితులు. ఆల యాలకు వెళ్లే మహిళలు, వృద్ధురాళ్లే వాళ్ల టార్గెట్‌. గుడికి నడిచి వెళుతున్న వారి నుంచి మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకు పోయేవారు.

ఆలయాలకు వెళ్లే మహిళలే టార్గెట్‌

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు

రూ.16 లక్షల చోరీ సొత్తు స్వాధీనం


కాకినాడ క్రైం, ఫిబ్రవరి 19: ఇద్దరూ స్నేహితులు. ఆల యాలకు వెళ్లే మహిళలు, వృద్ధురాళ్లే వాళ్ల టార్గెట్‌. గుడికి నడిచి వెళుతున్న వారి నుంచి మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకు పోయేవారు. అనంతరం వాటిని సొమ్ము చేసుకుని పేకాట ఆడుతూ జల్సాలు చేసేవారు. చివరికి కటకటాలపాలయ్యారు. చైన్‌స్నాచింగ్‌ల కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16 లక్షలు విలువైన 408 గ్రాములు(51కాసులు) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జరిగిన సమావే శంలో ఎస్పీ అద్నన్‌ నయీం అస్మి నిందితుల వివరాలను వెల్లడిం చారు. గత నెల 29న కాకినాడ మధురానగర్‌ గోకులం సమీపంలో అక్కాచెల్లెళ్లు యాక్టీవా వాహనంపై వెళుతుండగా వెనుక నుంచి పల్సర్‌ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఒకరి మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుని పరారయ్యారు. దీంతో అక్కాచెల్లెళ్లు టూటౌన్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ క్రైం సీఐ డి.గోవిందరావు తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు.


సీసీ పుటేజీల, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సామ ర్లకోట మండలం మాధవపట్నం జమునాకాలనీకి చెందిన సోపేటి ప్రకాష్‌(23), తామరపల్లి ఆనంద్‌కుమార్‌(25) లను నిందితులుగా భావించారు. కాకినాడ మెయిన్‌రోడ్డు గోల్డ్‌ మార్కెట్‌ సెంటర్‌లో మంగళవా రం సాయంత్రం అదుపులోకి తీసు కుని విచారించారు. ఆయా పోలీస్‌స్టే షన్ల పరిధిలో మొత్తం 25 చైన్‌ స్నా చింగ్‌లకు పాల్పడినట్టు ఎస్పీ పేర్కొ న్నారు. ప్రకాష్‌ పదో తరగతి చదివి కారు డ్రైవర్‌గా చేస్తుండగా, ఆనంద్‌ కుమార్‌ బీఎస్సీ కంప్యూర్స్‌ చదివాడు. సబ్జెక్టులు ఉండిపోవడంతో కార్పెంటర్‌ పని చేసేవాడు.


జల్సాలకు అలవాటు పడటంతో చైన్‌స్నాచింగ్‌లు చేస్తూ వచ్చిన సొమ్ములతో పేకాట ఆడేవారు. దేవాలయాలకు ఒంటరిగా వచ్చే మహిళల నుం చి బంగారు ఆభరణాలను అపహరించే వారు. వారిపై ఉన్న కేసు ల్లో 10 ప్రతీ గురువారం సాయిబాబా ఆలయాలకు వెళ్లే మహిళల మెడల నుంచి లాగేసుకున్నవేనని ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ఆరీఫ్‌ హఫీజ్‌, అడ్మిన్‌ ఎస్పీ కరణం కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీలు ఎస్‌.మురళీమోహన్‌, ఎం.అంబికాప్రసాద్‌, ఎస్‌బీ సీఐ ఎస్‌.రాంబా బు, డీసీఆర్‌బీ సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:19:34+05:30 IST