Abn logo
Oct 20 2021 @ 01:02AM

విద్యుత కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు

మరుట్ల విద్యుత కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు

కూడేరు, అక్టోబరు 19: మండలంలోని మరుట్ల రెండవ కాలనీలో విద్యుత సరఫరా సక్రమంగా లేకపోవడంతో స్థానిక మహిళలు ఆగ్రహించారు. మంగళవారం స్థానిక విద్యు త కార్యాలయాన్ని ముట్టడించారు. వారం రోజులుగా కరెంటు లేక అవస్థలు పడుతున్నా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాత్రి సమయంలో విషసర్పాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నారన్నారన్నారు. తక్షణం కాలనీకి విద్యుత సరఫరా చేయించాలని మహిళలు డిమాండ్‌ చేశారు.