స్త్రీ నిధి రుణ లక్ష్యం రూ.169 కోట్లు

ABN , First Publish Date - 2021-10-27T06:48:02+05:30 IST

ఈ ఏడాది స్త్రీ నిధి ద్వారా జిల్లాలోని మహిళా సం ఘాలకు రూ.169 కోట్ల రుణపంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్‌డీవో పీడీ కిరణ్‌కుమార్‌, డీజీఎం మెంచు రమేష్‌ తెలిపారు.

స్త్రీ నిధి రుణ లక్ష్యం రూ.169 కోట్లు
సమావేశంలో మాట్లాడుతున్న సెర్ప్‌ డీజీఎం రమేష్‌

సూర్యాపేటరూరల్‌, అక్టోబరు 26 : ఈ ఏడాది స్త్రీ నిధి ద్వారా జిల్లాలోని మహిళా సం ఘాలకు రూ.169 కోట్ల రుణపంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్‌డీవో పీడీ కిరణ్‌కుమార్‌, డీజీఎం మెంచు రమేష్‌ తెలిపారు. స్థానిక స్త్రీ నిధి కార్యాలయంలో స్ర్తీ నిధి కార్యక్రమాలపై మంగళవారం సెర్ప్‌ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 30 వేల పాడిగేదెల కొనుగోళ్లను డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సెర్ప్‌, స్ర్తీ నిధి సిబ్బంది సమన్వయంతో పనిచేసి బకాయిల వసూళ్లలో ముందుండాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత సాధించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.  సమావేశంలో సంజీవరావు, అదనపు డీఆర్‌డీవో స్ర్తీ నిధి ఆర్‌ఎం గోలి మహేందర్‌, లక్ష్మీనారాయణ, డీపీఏంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:48:02+05:30 IST