మహిళా కమిషన్ అధికార పరిధి దాటి ప్రవర్తిస్తోంది: లాయర్‌ రాజేంద్రప్రసాద్‌

ABN , First Publish Date - 2022-04-23T22:08:52+05:30 IST

ఏపీ మహిళా కమిషన్ తన అధికార పరిధిని దాటి ప్రవర్తిస్తోందని సీనియర్‌

మహిళా కమిషన్ అధికార పరిధి దాటి ప్రవర్తిస్తోంది: లాయర్‌ రాజేంద్రప్రసాద్‌

అమరావతి: ఏపీ మహిళా కమిషన్ తన అధికార పరిధిని దాటి ప్రవర్తిస్తోందని సీనియర్‌ లాయర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. బాధితుల తరపున సాక్షుల్ని విచారించే పరిధి మాత్రమే మహిళా కమిషన్‌కు ఉందన్నారు. వ్యక్తిగత సమస్యలపై విచారణకు పిలిచే అధికారం మహిళా కమిషన్‌కు లేదన్నారు. వ్యక్తిగతంగా తనకు ఏదైనా సమస్య వస్తే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. తనకు జరిగిన సమస్యకు తానే విచారించుకుంటా అనే అధికారం కోర్టుకు కూడా లేదన్నారు. నోటీసులు జారీ చేయటం మహిళా కమిషన్ న్యాయ పరిధిని దాటి ప్రవర్తించటమేనని ఆయన పేర్కొన్నారు. తనకు తలెత్తిన సమస్యకు తానే విచారణ జరిపి, తానే తీర్పులిచ్చుకుంటానంటే ఏ చట్టమూ ఒప్పుకోదని ఆయన అన్నారు.

Updated Date - 2022-04-23T22:08:52+05:30 IST