కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మహిళకు పక్షవాతం

ABN , First Publish Date - 2021-11-25T04:02:24+05:30 IST

కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మహిళకు పక్షవాతం

కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మహిళకు పక్షవాతం

హైదరాబాద్: హైదరాబాద్‌లో కోవిల్డ్ షీల్డ్ రెండవ డోస్ తీసుకున్న ఓ వ్యక్తికి పక్షవాతం వచ్చింది. గోశామహల్ నాంపల్లి పార్దివాడలో ఉంటున్న రాజ్ కుమారి(45) కోవిల్డ్ షీల్డ్ రెండవ డోస్ తీసుకోవడంతో కాళ్ళు, చేతులు పడిపోవడంతో దగ్గర్లో ఉన్న కేర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని స్థానికంగా ఉన్న కేర్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబు సభ్యులు తెలిపారు. వ్యాక్సిన్ వేసిన అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తాము అనుమాన్ టెకిడి‌లోని బస్తి దవాఖానలో వ్యాక్సిన్ ఇప్పించామని, ఇలా జరగడంతో జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేశామన్నారు. బాధితుడికి కోవిడ్ షీల్డ్ ఇచ్చిన వైద్య సిబ్బంది కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. 


ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి నిమ్స్ కు పంపించమని కోరినా కేర్ సిబ్బంది నిరాకరించినట్లు వారు తెలిపారు. ఒక రూ. లక్షా 50 వేలు కడితేనే పంపిస్తామని సిబ్బంది దౌర్జన్యం చేశారని, ప్రభుత్వ అధికారులు చెప్పినా కేర్ సిబ్బంది వినలేదని పేర్కొన్నారు. కేర్ ఆస్పత్రి ముందు రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పోలీస్ సిబ్బందితో  కేర్ సిబ్బంది నిమ్స్ కు తరలించారు. కేర్ ఆసుపత్రికి వచ్చే రోగులనుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారని బాధితుడి బంధువు ఆరోపించారు. ఆసుపత్రి నిర్లక్ష్యంతో చనిపోయినా లక్షలు కడితేనే మృతదేహాన్ని ఇస్తారని ఆరోపించారు. కేర్ ఆసుపత్రి దౌర్జన్యంతో నిరుపేదలు ఆందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు. నాంపల్లి కేర్ ఆసుపత్రి ఒక మాఫియాగా ఏర్పడి డబ్బులకోసం నిరుపేదలను పిడుచుకుతింటూ దందా కొనసాగిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాంపల్లి కేర్ ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నామని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-11-25T04:02:24+05:30 IST