పెళ్లైన కొన్నేళ్లకు భార్యకు వింత కోరిక.. మళ్లీ పెళ్లి చేసుకుందామనడంతో భర్త షాక్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2021-12-28T23:47:32+05:30 IST

మలేషియాలో ఓ మహిళ మళ్లీ పెళ్లి చేసుకుందామంటూ భర్తను కోరింది. భార్య వింత కోరిక విని ఆ భర్త షాక్ అయ్యాడు. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని చిరాకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ..

పెళ్లైన కొన్నేళ్లకు భార్యకు వింత కోరిక.. మళ్లీ పెళ్లి చేసుకుందామనడంతో భర్త షాక్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది. జీవితమంతా మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అయితే అప్పటికే పెళ్లైన జంటలు.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటాయా.. అంటే ఇదేం ప్రశ్న అంటాం. కలలో కూడా అలా ఎవరూ ఆలోచించరు అని చెబుతాం. ఇలాంటి మాటలు కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యం అనుకుంటాం. కానీ మలేషియాలో ఓ మహిళ మాత్రం మళ్లీ పెళ్లి చేసుకుందామంటూ భర్తను కోరింది. భార్య వింత కోరిక విని ఆ భర్త షాక్ అయ్యాడు. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని చిరాకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


మలేషియాకు చెందిన ఓ మహిళకు ఈ వింత కోరిక కలిగింది. కొన్నేళ్ల క్రితం అక్కడ భారీ వరదలు వచ్చాయట. అందులో వీరి ఇంట్లోని సమాన్లతో పాటూ పెళ్లికి సంబంధించిన ఫొటో ఆల్బమ్ కూడా పాడయిందట. ఎంతో పదిలంగా దాచుకున్న ఆల్బమ్ నీటిలో తడిచిపోవడం.. తనకు చాలా బాధ కలిగించిందట. ఎలాగైనా తమ ఆల్బమ్ మళ్లీ కావాలననుకుంది. అయితే అది సాధ్యం కాదు కాబట్టి.. మళ్లీ పెళ్లి చేసుకుని, ఫొటోలు తీసుకుందామంటూ భర్తకు చెప్పింది. ఈ మాట విన్న భర్త షాక్ అయ్యాడు. ఆల్బమ్ కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటీ.. నీకేమైనా పిచ్చా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడట. మళ్లీ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదంటూ తిరస్కరించాడట. దీంతో ఆమె తన బాధనంతా మీడియా ముందు వెళ్లబోసుకుంది. పాడైన పెళ్లి ఫొటోలను చూపిస్తూ.. తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

మీరు చాలా రకాల సమోసాలు చూసుంటారు.. కానీ ఇలాంటి సమోసాలు మాత్రం చూసుండరు..



Updated Date - 2021-12-28T23:47:32+05:30 IST