తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..

ABN , First Publish Date - 2021-12-22T00:01:06+05:30 IST

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ ఘటన.. సినిమా సీన్‌ను తలదన్నేలా ఉంది. కొత్తగా పెళ్లయిన మహిళ.. అత్తగారింటికి వచ్చిన మొదటి రోజే భర్తకు షాక్ ఇచ్చింది. తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను బయటికి పంపించి..

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..

కొన్ని ఘటనలు చూస్తే.. వాటి ముందు సినిమా సీన్లు కూడా దిగదుడుపు అనేలా ఉంటాయి. అంత పక్కాగా తమ పథకాన్ని అమలు చేస్తుంటారు కొందరు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ ఘటన.. సినిమా సీన్‌ను తలదన్నేలా ఉంది. కొత్తగా పెళ్లయిన మహిళ.. అత్తగారింటికి వచ్చిన మొదటి రోజే భర్తకు షాక్ ఇచ్చింది. తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను బయటికి పంపించింది. భర్త రాగానే ఆమె చేసిన పని తెలుసుకుని అవాక్కయ్యాడు. వివారాల్లోకి వెళితే..


రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన 40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా ఏదో ఒక వంకతో దాటవేస్తూ వచ్చాడు. దీంతో సంబంధాలు రావడమే ఆగిపోయాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే సంబంధం కుదిరిస్తానని చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ముందూ వెనుక ఎవరూ లేని ఓ అమ్మాయి ఉందని తనతో పాటు విజయవాడకు వస్తే పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. మిత్రుడు, మధ్యవర్తితో కలిసి బెజవాడ వెళ్లిన అతను.. అమ్మాయిని చూసి ఓ లాడ్జిలో గురువారం పెళ్లి చేసుకుని, భార్యతో యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేశారు.

పొద్దున్నే 5గంటలకు భార్య బయటకు వెళ్లడం చూసిన భర్తకు డౌట్.. వెనుకే వెళ్తే బస్టాండ్‌లో ఆమె నిర్వాకం చూసి..


అనంతరం హైదరాబాద్‌లో షాపింగ్‌ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల విలువ చేసే దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి 8.30కి స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కొత్త పెళ్లికూతురు బీరువాలో దుస్తులు సర్దుతున్నట్లు నటించి.. అందులోని రూ.2 లక్షల నగదు, కొత్త దుస్తులను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆమెతోపాటు వచ్చిన మరో యువతి నగరంలోని తన సోదరుడిని కలవాల్సి ఉందని చెప్పి స్థానికంగా కారును అద్దెకు మాట్లాడి అప్పటికే సిద్ధంగా ఉంచింది. తలనొప్పి వస్తోందని మాత్రలు తెమ్మని భర్తని మందుల దుకాణానికి పంపింది. అతను వెళ్లగానే వారిద్దరు కారులో ఉడాయించారు.

వచ్చిన ప్రతీ పెళ్లి సంబంధానికి నో చెప్తున్న అక్క.. అర్థం చేసుకోకుండా తమ్ముడే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు..!


ఇంజాపూర్‌ సమీపంలోకి రాగానే ఇద్దరి వాలకం చూసి.. కారు డ్రైవర్‌ అవాక్కయ్యాడు. కారులోనే వారు దుస్తులు మార్చుకోవడం చూసి ఇదేంటని ప్రశ్నించగా అతన్ని బెదిరించారు. ఎల్బీనగర్‌ వద్ద కారుదిగి విజయవాడకు వెళ్లారు. బాధిత పెళ్లికొడుకు సోమవారం స్థానిక పెద్దలకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మధ్యవర్తిని నిలదీయగా ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని అన్నట్లు సమాచారం. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు.

ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. ఒప్పించేందుకు ఫ్రెండ్స్‌తో ఆ కుర్రాడు చెప్పించిన అబద్ధం.. ప్రేయసి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2021-12-22T00:01:06+05:30 IST