Advertisement
Advertisement
Abn logo
Advertisement

శుభ్రత విషయంలో భార్య వింత ప్రవర్తన.. అంతా బయటికెళ్లగానే ఆమె చేసిన పని.. చివరకు విడాకులకు దారి తీసింది..

శుభ్రత అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అపరిశుభ్రత కారణంగా లేనిపోని రోగాలు చొరబడతాయనేది వాస్తవం. అందులోనూ ప్రస్తుత కరోనా సమయంలో శుభ్రత విషయంతో మరింత జాగ్రత్తలు పాటించాలి. కానీ దేనికైనా కొంతవరకే పరిమితి ఉంటుంది. అతి శుభ్రత అనేది కూడా ఒక్కోసారి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే.. బెంగళూరులో ఓ మహిళ ఇలాగే శుభ్రత విషయంలో చాలా అతిగా ప్రవర్తించేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చేసిన పని తెలుసుకుని భర్త షాక్ అయ్యాడు. ఆ సమస్య చివరకు విడాకుల వరకు వెళ్లింది...

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు 2009లో ఎంబీఏ చదువుతున్న యువతితో వివాహమైంది. కొన్నాళ్లకు వృత్తి రీత్యా అతను ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం భార్యను కూడా తీసుకెళ్లి అక్కడే సంసారం పెట్టాడు. కొన్నేళ్లకు అక్కడే పాప కూడా పుట్టింది. అతడి భార్య మొదటి నుంచీ శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. ఇంట్లో ప్రతి వస్తువునూ రోజూ శుభ్రం చేస్తూ ఉండేది. ఆమె శుభ్రతను చూసి భర్త కూడా మురిసిపోయేవాడు. మంచి భార్య దొరికిందని సంతోషపడేవాడు. ఒక్కోసారి ఆ శుభ్రత.. శ్రుతిమించి పోతుండేది. అయినా మామూలే అని తనకు తాను సర్దిచెప్పుకోనేవాడు. ఈ క్రమంలో వారు మళ్లీ ఇండియాకు రావల్సి వచ్చింది.

ఇటీవల వారికి కొడుకు కూడా పుట్టాడు. అనంతర కాలంలో కరోనా వచ్చి పడింది. దీంతో శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం తెలిసిందే. అసలే శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండే ఆమె.. కరోనా వచ్చిన తర్వాత మరింత శుభ్రత పాటించేది. దీంతో భర్తకు అప్పుడప్పుడూ చికాకు కలిగేది. మరీ అంత అతి శుభ్రత పనికిరాదని సమయం వచ్చినప్పుడల్లా భార్యకు చెబుతుండేవాడు. ఓ రోజు భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటిని శుభ్రం చేసే పనిలో ఉంది. అంతా శుభ్రం చేశాక.. భర్తకు సంబంధించిన ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్ కనిపించాయి. వాటిలో కూడా వైరస్ ఉండొచ్చనే ఉద్దేశంతో డిజర్జంట్ పౌడర్‌తో రెండింటినీ శుభ్రంగా కడిగి ఆరబెట్టింది.

ఇంటికి వచ్చిన అతడు.. భార్య చేసిన పని చూసి షాక్ అయ్యాడు. ఈ విషయమై భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇటీవల భర్త తల్లి మరణించడంతో సొంతూరికి వెళ్లి అంత్యక్రియలకు హాజరై వచ్చాడు. దీంతో భర్తను, ఇద్దరు పిల్లల్ని నెల రోజుల పాటు ఇంట్లోకి అనుతమించలేదు. అప్పటికే భార్య చేష్టలతో విసిగిపోయిన అతడు.. చివరకు ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఇలాంటి భార్య నాకు వద్దంటూ కోర్టు మెట్లుఎక్కాడు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత వారికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలించలేదు. అయితే ఆ మహిళ మాత్రం తనకు భర్త కావాలని పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇదిలావుండగా, శుభ్రత విషయంలో ఆమె తీరును చూసి స్థానికులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement