అడ్మిన్‌లకే అన్ని హక్కులు

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

వాట్సాప్‌ - గ్రూప్‌ అడ్మిన్‌లకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఏ మెసెజ్‌నైనా డిలీట్‌ చేసే హక్కు గ్రూప్‌ అడ్మిన్‌కు ఉంటుంది. కొత్త అప్‌డేట్‌ ప్రకారం గ్రూప్‌లోని సభ్యులను రెస్ట్రిక్ట్‌ చేయడానికి తోడు సమాచారాన్ని ఎడిట్‌ చేసే హక్కు సైతం ఉండదు...

అడ్మిన్‌లకే అన్ని హక్కులు

వాట్సాప్‌ - గ్రూప్‌ అడ్మిన్‌లకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఏ మెసెజ్‌నైనా డిలీట్‌ చేసే హక్కు గ్రూప్‌ అడ్మిన్‌కు ఉంటుంది. కొత్త అప్‌డేట్‌ ప్రకారం గ్రూప్‌లోని సభ్యులను రెస్ట్రిక్ట్‌ చేయడానికి తోడు సమాచారాన్ని ఎడిట్‌ చేసే హక్కు సైతం ఉండదు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. గ్రూప్‌ అడ్మిన్‌ ఒకరకంగా మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. 


డబ్ల్యూఏబేటాఇన్ఫో ప్రకారం కొద్ది రోజుల్లోనే గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇతోధిక అధికారాలు దాఖలుపడనున్నాయి. బేటా ఫర్‌ ఆండ్రాయిడ్‌ 2.22.11.4 ప్రకారం ఈ ఫీచర్‌ ఇంకా డెవలప్‌మెంట్‌ దశలోనే ఉంది. అమలులోకి  వస్తే, గ్రూప్‌ అడ్మిన్‌ తొలగించగానే, ఎవరిదో మెసేజ్‌ తీసేసినట్టు పాపప్‌ మెసేజ్‌ వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే 2017లో పరిచయం చేసిన ‘డిలీట్‌ ఎవ్విర్‌వన్‌’ మాదిరిగా ఉంటుంది. దీని ప్రకారం యూజర్‌ లేదంటే గ్రూపులో సభ్యుడు ఎవరికైనా డిలీట్‌ చేసే హక్కు ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌నకు త్వరలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. 

Read more