ధర్మవరం, జనవరి 20: పట్టణంలోని పీఆర్‌టీ వీధిలోగల పాండు రంగ స్వామి దేవాలయంలో గురువారం గోదా రం గనాయకుల కల్యాణ మహో త్సవాన్ని అర్చ కులు శ్రీధర్‌శర్మ కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సం దర్భంగా కల్యాణ వేదికపై శ్రీరంగనాయకులను ఉంచి ప్రత్యే కంగా అలం కరించి పూజలు చేశారు. అ నంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు కల్యాణాన్ని అంగరంగ వైభవం గా నిర్వ హించారు. అదేవిధంగా పరిశేమునయ్య భజన మండలి వారు అన్న మయ్య కీర్తనలను గావించారు.