పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-27T05:00:50+05:30 IST

పేదల సంక్షేమమే ప్రభుత్వధ్యేయమని జడ్పీ చైర్‌ప ర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. సోమవారం నూత నంగా మంజూరైన రేషన్‌కార్డులను జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పంపిణీచేశారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రేషన్‌ కార్డులను అందజేస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 26: పేదల సంక్షేమమే ప్రభుత్వధ్యేయమని జడ్పీ చైర్‌ప ర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. సోమవారం నూత నంగా మంజూరైన రేషన్‌కార్డులను జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారభద్రతలో భాగం గా ప్రతి లబ్ధిదారుడికి రేషన్‌కార్డు అందజే యడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3124కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. మూడురోజుల పాటు కార్డుల పంపిణీ కొనసాగుతుం దన్నారు. ఆగస్టు1 నుంచి నూతనకార్డు పొందిన వారు రేషన్‌పొందవచ్చన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపుకలెక్టర్‌ రాజేశం, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, ఆర్డీవోదత్తు, ఎంపీపీ మల్లికార్జున్‌,వైస్‌ఎంపీపీ మంగ, ఎంపీడీవో శశికళ,తహసీల్దార్‌అజీజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రేషన్‌ కార్డులు రాని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కుంటే తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అనుమతి ఇస్తారన్నారు. ఈప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే కోనేరుకోనప్ప మాట్లాడుతూ లబ్ధిదారులు రేషన్‌కార్డులను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌చైర్మన్‌ గిరీష్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌, ఆర్డీవో చిత్రు, తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వాంకిడి: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మిఅన్నారు. సోమవారం మండలపరిషత్‌ కార్యాలయంలో నూతనంగా మం జూరైన రేషన్‌ కార్డులను వారు పంపిణీ చేశారు.

రెబ్బెన: ప్రభుత్వసంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణంసతీష్‌, ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ మండలంలో 832దరఖాస్తు చేసుకోగా 588 మంజూ రైనట్లు తెలిపారు.

దహెగాం: మండలకేంద్రంలోని ఎంపీ డీవో కార్యాలయంలో సోమవారం జడ్పీటీసీ శ్రీరామరావు, తహసీల్దార్‌ రామ్మోహన్‌ రేషన్‌కార్డులను, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

తిర్యాణి: ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రంసక్కు, అదనపుకలెక్టర్‌ రాజేశం రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డు అందేలా చూస్తామన్నారు. 

సమస్యలు పరిష్కరించాలి..

మండలంలోని చిన్న గ్రామ పంచాయతీలకు రోడ్ల సమస్యలు తీర్చాలని కోరుతూ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌కు సర్పంచ్‌లు  వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-07-27T05:00:50+05:30 IST