పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్వేయం

ABN , First Publish Date - 2021-04-17T06:13:35+05:30 IST

పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రత, సంక్షేమం కోసం సపాయి కర్మచారి జాతీయ కమిషన నిరంతరం పాటుపడుతుందని కమిషన చైర్మన ఎం.వెంకటేశం పేర్కొన్నారు.

పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్వేయం
సమావేశంలో మాట్లాడుతున్న సపాయి కర్మచారి జాతీయ కమిషన చైర్మన ఎం.వెంకటేశం

సపాయి కర్మచారి జాతీయ కమిషన చైర్మన ఎం.వెంకటేశం

కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రత, సంక్షేమం కోసం సపాయి కర్మచారి జాతీయ కమిషన నిరంతరం పాటుపడుతుందని కమిషన చైర్మన ఎం.వెంకటేశం పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందనహాలులో జిల్లాలోని పారిశుధ్య కార్మికలు (సపాయి కర్మచారీలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మలోల అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో కర్మచారి జాతీయ కమిషన చైర్మన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారంటే పారిశుధ్య కార్మికులే కారణమన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో కొవిడ్‌ సమయంలో పారిశుధ్యకార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. స్వచ్ఛభారత మిషన సఫలీకృతంలో పారిశుధ్యకార్మికుల పాత్ర ఎంతైనా ఉందన్నారు. వీరందరి సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం సపాయికర్మచారి జాతీయ కమిషనను ఏర్పాటు చేసిందన్నారు. జాతీయ స్థాయిలో నేషనల్‌ సపాయి కర్మచారి ఫైనాన్స డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల ఆర్థికాభివృద్ధికి రుణాలు అందిస్తున్నామన్నారు. ఇలాంటి కార్పొరేషన రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుకు ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. స్థానికంగా సమస్యలను జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి, జడ్పీ సీఈఓ శ్రీనివాసరెడ్డి, డీపీవో ప్రభాకర్‌ రెడ్డి , నగర కమీషనర్‌ లవన్న, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇనస్పెక్టర్లు, సపాయి కర్మచారి యూనియన్లు, పారిశుధ్యకార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:13:35+05:30 IST