ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

ABN , First Publish Date - 2021-05-07T05:21:55+05:30 IST

కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని ఆర్టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం కడప ఆర్టీసీ రీజనల్‌ కార్యాలయ ప్రాంగణంలో 22 పడకలతో నూతనంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆసుపత్రిని నిర్మించారు. దీనిని గురువారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌ విధానం ద్వారా సీఎం వైఎస్‌ జగన ప్రారంభించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
కడపలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కలెక్టర్‌ హరికిరణ్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు

ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం

కడప(మారుతీనగర్‌), మే 6: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని ఆర్టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం కడప ఆర్టీసీ రీజనల్‌ కార్యాలయ ప్రాంగణంలో 22 పడకలతో నూతనంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆసుపత్రిని నిర్మించారు. దీనిని గురువారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌ విధానం ద్వారా సీఎం వైఎస్‌ జగన ప్రారంభించారు. సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాగూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఏరియా ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపామన్నారు. అనంతరం కడపలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణం నుంచి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యసౌకర్యం అందించేందుకు వీలుగా ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్‌ సి.హరికిరణ్‌ మాట్లాడుతూ సుమారు రూ.3.8 కోట్లతో ఏరియా ఆసుపత్రి భవనాన్ని, మరో రూ.2 కోట్లతో మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌, మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. 1.6 ఎకరాలలో ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఇందులో ఏడుగురు వైద్య నిపుణులు మరో 27 మంది పారామెడికల్‌ సిబ్బంది, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినా్‌షరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కడప నగర మేయర్‌ సురే్‌షబాబు, జేసీ గౌతమి, ఏరియా ఆసుపత్రి ప్రధానవైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌యం జితేంద్రనాధరెడ్డి, కడప డిపోమేనేజర్‌ నిరంజన్‌, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:21:55+05:30 IST