Advertisement
Advertisement
Abn logo
Advertisement

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

ఎమ్మెల్యే భాస్కర్‌రావు 

మిర్యాలగూడ, నవంబరు 26: ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణంలోని మహ్మదీయ మసీదులో గురువారం రాత్రి జరిగిన ఇస్తేమా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. మైనార్టీ విద్యార్థులకు విశాలమైన విద్యాలయాలు ఏర్పాటు చే సిన ప్రభుత్వం యువతకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు. షాదీ ముబారక్‌, రంజాన తోఫా లాంటి కార్యక్రమాలు ఇ తర రాష్ట్రాల్లో అమలు జరగడం లేదన్నారు. కార్యక్రమానికి హాజరై న ప్రవచనకారులు హజ్రత మౌలానా, ముజమ్మిల్‌ రషీద్‌ మాట్లాడుతూ అల్లా కృపతో ముస్లీంలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నా రు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌చైర్మన కుర్ర విష్ణు, వలీలుల్లా, ఇమ్రాన, రహమాన,ఖాదర్‌, నజ్మొద్దీన, హఫీజ్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement