వైభవంగా కోదండరాముని కల్యాణం

ABN , First Publish Date - 2022-05-17T05:19:51+05:30 IST

మండలంలోని రాజుపాలెం గ్రామంలో సోమ వారం కోదండరాముని కల్యాణం కన్నుల పండువగా జరిగింది.

వైభవంగా కోదండరాముని కల్యాణం
మార్టూరు: గ్రామోత్సవంలో కోదండరామస్వామి దంపతులు

మార్టూరు, మే 16: మండలంలోని రాజుపాలెం గ్రామంలో  సోమ వారం కోదండరాముని కల్యాణం  కన్నుల పండువగా జరిగింది. ఈ నెల 12 నుంచి సీతా సమేత కోదండరామస్వామి కల్యాణ మహాత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. అందులో భాగంగా  స్వామి వారి కల్యాణాన్ని అర్చకులు సీతారామాచార్యులు ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు ముఖ్యంగా మహిళలు సీతారాములు కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. గ్రామంలోని పలువురు దంపతులు స్వామి వారి కల్యాణంలో పాల్గొని ఆనంద భరితులయ్యారు. తదనంతరం భక్తులకు అన్నదానం నిర్వ హించారు. అనంతరం సీతారాముల దంపతుల విగ్రహాలను గ్రామం లో  ఊరేగింపు చేశారు. కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త జాష్టి రవీంద్ర బాబు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. 


చెరుకూరులో.. 

పర్చూరు, మే 16: మండలంలోని చెరుకూరు గ్రా మంలో వేంచేసియున్న శ్రీ త్రివిక్రమ, అగస్తేశ్వరస్వామివారి దేవాల యంలో సోమవారం స్వామివార్ల కల్యాణ మహోత్సవ వేడుకలు ఘ నంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్వామివార్లను ప్రత్యేకంగా అ లంకరించి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన అశేష భక్తుల నడుమ స్వామివార్ల కల్యాణ ఘట్టం అత్యంత భక్తి శ్రద్ధ లతో ముగిసింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్ర మం ఏర్పాటుచేశారు. సాయంత్రం స్వామివార్లను గరుడ వాహనంలో ఏర్పాటుచేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కల్గకుండా అలయ కార్యనిర్వాహణాధికారి నాగయ్య అధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంక రించారు. 


సోపిరాలలో.. 

చినగంజాం, మే 16: మండలంలోని సోపిరాల గ్రా మంలో వేంచేసియున్న లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి 28వ వార్షిక కల్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. తదనంతరం వేదపండి తులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా దంపతులచే కల్యా ణ మహోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి మహిళలు  సామూహి క కుంకుమ పూజలు నిర్వహించారు.  భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది.  

Updated Date - 2022-05-17T05:19:51+05:30 IST