Abn logo
May 30 2020 @ 22:47PM

పెళ్లి ముహూర్తం కుదిరింది

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. రానా మోములో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ప్రేమలో ఉన్నానని అతడు ప్రకటించిన కొన్ని రోజులకు రామానాయుడు స్టూడియోలో రోకా వేడుక జరిగింది. కాబోయే వధూవరులు ఇద్దరూ నవ్వులు చిందిస్తూ నడిచారు. త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఆగస్టు 8న దగ్గుబాటి వారబ్బాయి రానా, బజాజ్‌ వారమ్మాయి మిహీకా పెళ్లి జరగనుంది. ఇరువురి కుటుంబ పెద్దలు ఆ రోజున మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘‘అవును... మా అబ్బాయి పెళ్లి ఆగస్టు 8న అనుకుంటున్నాం. మంచి ముహూర్తం కుదిరింది. హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక ఉంటుంది. కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడానికి లేదు కదా! పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సింపుల్‌గా చేయాలనేది ప్లాన్‌’’ అని అన్నారు.


Advertisement
Advertisement
Advertisement