పెళ్లి వాయిదాపడిందని..

ABN , First Publish Date - 2020-06-01T11:16:33+05:30 IST

పెళ్లి వాయిదాపడడంతో ఆ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తకూర్మినాయుడుపేటలో శని వారం రాత్రి

పెళ్లి వాయిదాపడిందని..

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య 


 ఎచ్చెర్ల, మే 31: పెళ్లి వాయిదాపడడంతో ఆ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తకూర్మినాయుడుపేటలో శని వారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పప్పల వెంకటరెడ్డి (28) అనే యువకుడు తన తల్లి దమయంతితో కలసి శ్రీకాకుళం నగరంలోని బలగలో నివాసముంటున్నాడు. శనివారం ఉదయం వెంకటరెడ్డి స్వగ్రామానికి వచ్చాడు.  అదే రోజు రాత్రి 9.30 గంటల సమయంలో తల్లితో ఫోన్‌లో మాట్లాడాడు.


రాత్రి కొత్తకూర్మినాయుడుపేటలోనే ఉండి, ఆదివారం టెక్కలి వెళ్తానని చెప్పాడు. అయితే, ఆ తరువాత తన ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగుజూసింది. వెంకటరెడ్డికి ఈ నెల 13న గార మండలానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం జరగా ల్సింది. అయితే,  ఆమె మైనర్‌ కావడంతో పెళ్లి వాయిదాపడింది. ఈ కారణంగా మనస్తాపానికి గురై ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నాడని తల్లి దమయంతి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతోనే ఆత్మహత్యకు పాల్పడిఉంటాడని అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-01T11:16:33+05:30 IST