ప్రజాఉద్యమాల ఆయుధం పాట

ABN , First Publish Date - 2021-09-29T05:57:14+05:30 IST

ప్రజాఉద్యమాలకు పాట ఆయుధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ప్రజానాట్యమండలి రాష్ట్ర రెండో మహాసభల ను మంగళవారం

ప్రజాఉద్యమాల ఆయుధం పాట
మహాసభలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

సూర్యాపేట కల్చరల్‌, సెప్టెంబరు 28: ప్రజాఉద్యమాలకు పాట ఆయుధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ప్రజానాట్యమండలి రాష్ట్ర రెండో మహాసభల ను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. కళాకారులులేని పోరాటాలు లేవన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకూ పాట పాత్ర ఎంతో గొప్పదన్నారు. చదువు రాని మట్టి మనుషులు పాడే పాటలు ప్రజాజీవితంలో అనేక మార్పులకు కారణమవుతున్నాయని అన్నారు. కవులు, కళాకారులు లేకుండా ఏ ఉద్య మం, ఏ పోరాటం విజయం సాధించలేదన్నారు. అధికారంలోకి వచ్చే వరకు ఎన్నో హామీలు ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత వాటిని నెరవేర్చడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవులు, కళాకారులు, రచయితలకు రక్షణ కరువైందన్నారు. ప్రశ్నించే గొతుకలైన కళాకారులను హత్యలు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి కాం తారావు,  నాయకులు నర్సింహ, మల్లు నాగార్జునరెడ్డి, ఆనంద్‌, సాంబరాజు, యాదగిరి, గోవర్థన్‌, వినోద్‌కుమార్‌, గౌతమి, ములకలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, భాస్కర్‌, శంకర్‌, సదానంద్‌, నరేందర్‌, రమేష్‌, సైదులు, వెంకట్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T05:57:14+05:30 IST