ఆశల రెక్కలు!

ABN , First Publish Date - 2021-06-25T05:39:32+05:30 IST

జిల్లాలో జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పా టుపై మళ్లీ ఆశలు రేకెత్తుతు న్నాయి. ఎయిర్‌పోర్ట్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇం డియా(ఏఏఐ).. అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

ఆశల రెక్కలు!
జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ప్రతిపాదిత స్థలం

జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమం
రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏఏఐ
డోమెస్టిక్‌ విమానాశ్రయం ఏర్పాటు చేసే అవకాశం
రూ.328 కోట్ల నిధులు, 510ఎకరాల భూమి
అవసరమని నివేదికలో వెల్లడి

ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, జూన్‌24: జిల్లాలో జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పా టుపై మళ్లీ ఆశలు రేకెత్తుతు న్నాయి. ఎయిర్‌పోర్ట్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇం డియా(ఏఏఐ).. అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. స్థలం అనుకూలంగా ఉందని పేర్కొనడమేకాకుండా, ఎంత భూమి అవసరం? ఎన్ని నిధులు ఖర్చవుతా యి? తదితర అంశాలను నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పౌరవిమానాయాన శాఖకు అంగీకారం తెలిపితే సర్వే పనులు మొదలయ్యే అవకాశముంది. జక్రాన్‌పల్లి వద్ద డొమెస్టిక్‌(దేశీయ) విమానాశ్రయం ఏర్పాటుకు రూ.328 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, 510ఎకరాల భూమి అవసరమని ఏఏఐ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు రూ.348 కోట్లు, 740ఎకరాల భూమి అవసరమని తెలిపింది. జక్రాన్‌పల్లి వద్ద ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉంది. భూసేకరణకు ఎక్కువగా ఖర్చు అవ సరం లేదు. భూసేకరణకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవస రం లేనందున అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసిన పెద్ద భారం పడదు. రాష్ట్రంలో కొత్తగా మొ త్తం ఆరు విమానా శ్రయాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని చోట్ల భూసేకరణ చే యాల్సి వస్తోంది. భూ సేకరణకు, నిర్మాణాలకు పెద్ద మొత్తం లో ఖర్చువుతోంది. జక్రాన్‌పల్లిలో మాత్రం కేవలం నిర్మాణాల కే ఖర్చు చేస్తే సరిపోతుంది. ప్రభుత్వ భూమి అసైన్‌ చేసి ఉ ంటే లబ్ధిదారులకు ఇతర పథకాలకు అసైన్‌భూమి తీసుకున్న వారికి ఇచ్చినట్లు వీరికి కూడా ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరము ంది. ఖర్చు తగ్గించుకోడానికి డొమెస్టిక్‌ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జక్రాన్‌పల్లిలో భూసేకరణకు పెద్దగా ఇబ్బందులెదురయ్యే అవకాశాలు లేవు. గతంలో రెండు వేల ఎకరాల భూమి అవసరమని ప్రచారం జరగడంతో భూయజమానులు ఆందోళన చెందారు.
ఖర్చంతా రాష్ట్రానిదే..
చిన్న పట్టణాలకు విమాన సేవలు అందుబాటులోకి తీసు కురావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2017 ఏప్రిల్‌ 27న ఉడాన్‌ పథకాన్ని ప్రారంభించారు. ఉడాన్‌ పథ కం ప్రారంభించినప్పటికీ ఆర్ధిక సాయం మాత్రం చేయడం లేదు. ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని స్పష్టం చేసిం ది. దీంతో భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతోంది. ఆరు చోట్ల విమానాశ్రయాలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతోంది. దీంతో ఆర్ధిక భారం తగ్గించుకోవాలని భావి స్తోంది. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాలు ఒకేసారి కాకుండా దశల వారీగా చేపట్టే అవకాశ ముంది. అంతేకాకుండా ఖ ర్చు తగ్గిం
చుకోడానికి మొదట ఎయిర్‌స్ట్రిఫ్‌ ఏర్పాటు చేసే అవకాశముంది. భవిష్యత్తు అ వసరాలదృష్ట్యా విమానాశ్ర యా లుగా మార్చవచ్చు. ఎయిర్‌స్ట్రి క్‌లలో ఒకే రన్‌వేతో విమా నాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ల సౌకర్యం ఉంటుంది. దేశీ య విమానాలు మాత్ర మే నడుస్తాయి. అంతర్జా తీయ విమానాలు రావు. గల్ఫ్‌, అమెరికా తదితర దే శాల వారు హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగించా ల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్‌ ఏ ప్రిల్‌ మొదటి వారంలో కేంద్రం పౌ ర విమానాయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను తెలంగాణలో ఆరు ఎయిర్‌ స్ర్టి ప్‌లు మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే..
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో నే విమానాశ్రయాల ఏర్పాటు లో కదలికవచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమం త్రిగా ఉన్న సమయంలో విమానాశ్రయాల ఏర్పా టు అంశం తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత అది మరుగున పడిపో యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర జనాభా పెరగడం, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తున్నం దున వైమానిక సేవలు విస్తరించడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గత డిసెంబరు 12న ముఖ్యమం త్రి చంద్రశేఖరరావు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర విమానయాన మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరీని కలిసి రాష్ట్రంలో వి మానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్ర భుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చింది. ఎట్టకే లకు విమానాశ్రయం ఏర్పాటులో కదలి క రావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-25T05:39:32+05:30 IST