వేసవిలోనూ ‘జల’హొయలు

ABN , First Publish Date - 2022-05-18T07:06:08+05:30 IST

ఎండాకాలంలోనూ ‘చెలిమిచేను’ జలహొయలు పోతోంది. చుట్టూ పరచుకున్న పచ్చదనం.. కొండలు చీల్చుకుంటూ 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది.

వేసవిలోనూ ‘జల’హొయలు
చెలిమిచేను జలపాతం

 రామకుప్పం: ఎండాకాలంలోనూ ‘చెలిమిచేను’ జలహొయలు పోతోంది. చుట్టూ పరచుకున్న పచ్చదనం.. కొండలు చీల్చుకుంటూ 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది. రామకుప్పం మండలం చిక్కపల్లెతాండా పంచాయతీ చెలిమిచేను సమీపంలో ఈ జలపాతం ఉంది. ఏటా ఆగస్టు నుంచి డిసెంబరు వరకే జలకళ ఉండేది. ఆ తర్వాత కళావిహీనంగా మారుతుంది. మరిప్పుడు.. పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువప్రాంతంలోని చెరువులు, వాగులు, వంకల నుంచి వస్తున్న నీటితో జలపాతం జలజలపారుతోంది. రామకుప్పానికి 13 కిలోమీటర్ల దూరంలోని ఈ జలపాతానికి దారి వసతి.. సందర్శకులకు రక్షణ చర్యలు చేపడితే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక, జలపాతం వద్ద గల రెండు కొండల మధ్య డ్యాం నిర్మిస్తే పది పంచాయతీల పరిధిలో భూగర్భజలాలు వృద్ధి చెందుతుంది. వన్యప్రాణుల దాహార్తి తీరుతుంది.

Updated Date - 2022-05-18T07:06:08+05:30 IST