కారును ఢీ కొన్న వాటర్‌ ట్యాంకర్‌

ABN , First Publish Date - 2021-06-13T04:38:25+05:30 IST

జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్‌ రోడ్డు సమీపంలోని కావేరి హోటల్‌ వద్ద ఆగిఉన్న కారును మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది.

కారును ఢీ కొన్న వాటర్‌ ట్యాంకర్‌
ఆగి ఉన్న కారును ఢీకొన్న వాటర్‌ ట్యాంకర్‌

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 12: జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్‌ రోడ్డు సమీపంలోని కావేరి హోటల్‌ వద్ద ఆగిఉన్న కారును మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. కారును ఢీకొట్టిన వెంటనే ట్రాక్టర్‌ టైర్‌ ఊడిపోవడంతో పాటు కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ప్రయాణికులు, ప్ర జలు గుమిగూడి ఉంటారు. ప్రమాదం జరిగిన సమయం లో ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి నట్లయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - 2021-06-13T04:38:25+05:30 IST