Abn logo
Sep 25 2020 @ 05:24AM

28న జలకళ పథకం ప్రారంభం

Kaakateeya

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయం లాభాసాటిగా మార్చేందుకు వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయనున్నట్టు కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవరత్నాల్లో భాగంగా ఈ పఽథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజవర్గాల్లో ఒక్కో రిగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 28న ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఆసక్తిగల రైతుల నుంచి సచివాలయాలు ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కాగా లబ్ధిదారునికి కనీసం 2.5 ఎకారాలు తప్పనిసరిగా ఉండలని అన్నారు. 2.5 ఎకరాలు లేనివారు పక్క రైతులతో కలిసి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఇంతకు ముందే బోర్‌వెల్‌, మోటార్లు ఉన్నవారు అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement