Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 28 May 2022 21:32:56 IST

The Warriorr: చిత్రీకరణ పూర్తి చేశారు

twitter-iconwatsapp-iconfb-icon
The Warriorr: చిత్రీకరణ పూర్తి చేశారు

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యంగ్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న చిత్రం ‘ది వారియర్’ (The Warriorr). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి లింగుస్వామి (N Linguswamy) దర్శకుడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi) మాట్లాడుతూ.. ‘‘మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని అందరూ ఫోన్ చేసి చెబుతున్నారు. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజు(మే 28)తో సినిమా చిత్రీకరణ పూర్తయింది. గత వారం రోజులుగా మా హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించాం. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తాం. త్వరలో మిగతా పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆల్రెడీ విడుదలైన ‘బుల్లెట్..’ సాంగ్ అందరి నోట వినబడుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాటపై యంగ్‌స్టర్స్ రీల్స్‌ చేస్తున్నారు. పోస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పాటకు 55 మిలియన్ వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. మిగతా పాటలు కూడా అందరినీ మెప్పించేవిగా ఉంటాయి..’’ అని అన్నారు. కాగా, రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International