నవాబులను ఎదురించిన యోధుడు సర్వాయి పాపన్న

ABN , First Publish Date - 2022-08-19T05:50:27+05:30 IST

బహుజనులకు రాజ్యాధికారం కావాలని నిజాం, జమీందార్లను ఎదురించి పోరాడిన మహాయోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న అని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

నవాబులను ఎదురించిన యోధుడు సర్వాయి పాపన్న
సర్వాయి పాపన్న విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మేయర్‌ సునీల్‌రావు

- మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 

- నగరంలో భారీ బైక్‌ ర్యాలీ 

- ఘనంగా జయంతి వేడుకలు 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 18: బహుజనులకు రాజ్యాధికారం కావాలని నిజాం, జమీందార్లను ఎదురించి పోరాడిన మహాయోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న అని  మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న 372వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్గునూర్‌ మానేరు వంతెనపై ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. సర్వాయి పాపన్నజీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్‌  సునీల్‌రవుఉ మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను నేటితరానికి తెలియజేసేందుకు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మానేరు వంతెనపై ఉన్న విగ్రహం వద్ద ఐలాండ్‌ను సుందరీకరించి వచ్చే జయంతి వేడుకలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ మైదానం నుంచి తెలంగాణ చౌక్‌, బస్టాండ్‌, కమాన్‌ చౌరస్తా మీదుగా అల్గునూర్‌ వంతెనపై ఉన్న సర్వాయిపాపన్న విగ్రహం వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్‌, కార్పొరేటర్లు శారద రవీందర్‌, ఐలేందర్‌ యాదవ్‌, భూమగౌడ్‌, జంగిలి సాగర్‌, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్‌గౌడ్‌, గౌడ సంఘం నాయకులు కలర్‌ సత్యంగౌడ్‌, ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T05:50:27+05:30 IST